భీమిలి: మధురవాడ బీచ్లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు: గాలింపు చర్యలు ముమ్మరం
మధురవాడ ఐటీ సెజ్ రుషికొండ తీరంలో సముద్రంలో స్నానానికి దిగిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. మల్లయ్యపాలెంకు చెందిన 14 ఏళ్ల సూర్యప్రకాష్, నీలేష్, ప్రశాంత్ అలల తాకిడికి కొట్టుకుపోయారు. పోలీసులు, లైఫ్ గార్డ్లు గాలింపు చేపడుతున్నారు.