శ్రీశైలం: 25 లక్షల వ్యయంతో మహానంది రెండవ చిన్న కోనేరు మరమ్మత్తు పనులు ప్రారంభం
మహానందిలోని రెండో చిన్న కోనేరులో మరమ్మతు పనులను ఆలయ అధికారులు ప్రారంభించారు. సుమారు రూ. 25 లక్షల వ్యయంతో మెట్లు బాగు చేయడం, నూతన బండల ఏర్పాటు పనులు చేపట్టారు. ఇప్పటికే బయట ఉన్న ఒక కోనేరును ఆధునికీకరించిన విషయం తెలిసిందే. ఆలయ సహజత్వాన్ని దెబ్బతీయకుండా పనులు పూర్తి చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.