పర్యావరణ అనుకూల దీపావళి పోస్టర్ ఆవిష్కరించిన.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్,
అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ,పర్యావరణ అనుకూల దీపావళి పై పోస్టర్ ను శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని దీపావళి పండుగ సందర్భంగా ఇష్టమైన వారికి ఇచ్చే కానుకలు పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.