బోధన్: జాడి జమాల్పూర్ గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన
సాలూర మండలం జాడి జమాల్ పూర్ గ్రామంలో ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో నవీపేట మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదనీ అన్నారు. సాలూర విద్యుత్ ఉప కేంద్రంపై అధిక లోడ్ కావడంతో జాడి జమాల్పూర్ గ్రామంలో రెండు కోట్ల 23 లక్షలతో 33/11 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 యూనిట్ల గృహ విద్యుత్తు ఉచితంగా అందిస్తున్నామని గుర్తు చేశారు. కొత్తగా నిర్మించబోయే విద్యుత్ ఉపకేంద్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు.