మహబూబాబాద్: కొత్తగూడ మండలంలోని అడవి పంది మాంసం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు..
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అడవి పంది మాంసం తరలిస్తున్న వ్యక్తి సోమవారం మధ్యాహ్నం 2:00 లకు ఫారెస్ట్ అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని సాదిరెడ్డిపల్లి నుంచి మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో విక్రయించడానికి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తపల్లి నుంచి కొత్తగూడ మండల కేంద్రానికి వచ్చే రహదారి బురదమయంగా ఉండటంతో మాంసం జారి కింద పడింది. MHBD సమీపంలోని ఈదుల పూస పల్లికి చెందిన వ్యక్తిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.