గుడిబండ లో టీడీపీ బూత్ ఇన్చార్జి మృతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ.
గుడిబండ మండలం కేజీఎన్ పాళ్యం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ బూత్ ఇంచార్జ్ రామచంద్ర శనివారం ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కార్యకర్తలు నాయకులతో కలిసి గ్రామానికి వెళ్లి రామచంద్ర కు ఘనంగా నివాళులు అర్పించారు. రామచంద్ర మృతి టిడిపికి తీరని లోటని కుటుంబానికి అండగా ఉంటామని తిప్పేస్వామి తెలిపారు.