నాంపల్లి: నరసింహ్మలగూడెం లోని రైస్ మిల్లులో ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాహసిల్దార్ మాచన రఘునందన్
నల్గొండ జిల్లా, నాంపల్లి మండల పరిధిలోని నర్సింహ్మలగూడెంలోని రైస్ మిల్లులో సోమవారం సాయంత్రం అక్రమంగా రేషన్ బియ్యం దందా చేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యాన్ని నూకలు చేసి అమ్ముతున్నట్లు ఆయన గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.