అశ్వారావుపేట: అశ్వారావుపేట,భద్రాచలం రోడ్డులో చందాలు వసూలు చేస్తున్న మహిళలను అడ్డుకున్న పోలీసులు,శభాష్ అంటున్న వాహనదారులు
అశ్వారావుపేట భద్రాచలం రోడ్ లో రోడ్డుకి అడ్డంగా తాడు పట్టుకుని మహిళలు వాహనాలను ఆపి దసరా పండుగ, ముత్యాలమ్మ పండగ భూమి పూజ లంటూ డబ్బులు వసూలు చేస్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. అశ్వరావుపేట నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఏకంగా 13చోట్ల టోల్ గేట్లు మాదిరి వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సడెన్ గా వాహనాల బ్రేకులు పడకపోతే యాక్సిడెంట్లు అవుతాయన్న భయాందోళనలు సైతం ఉన్నాయి. బుధవారం వీటికి పుల్ స్టాప్ పెడుతూ పోలీసులు రంగ ప్రవేశం చేసి వీరందరినీ చెదరగొట్టడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.