ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ముద్దిరెడ్డి పల్లి మరియు మార్కండేయ నగర్ లో నూతన గృహ నిర్మాణానికి భూమి పూజలు
హిందూపురం శాసన సభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు హిందూపురంలో మున్సిపల్ చైర్ పర్సన్ రమేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పిఏ వీరయ్య లు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ముద్దిరెడ్డి పల్లి మరియు మార్కండేయ నగర్ లో నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ చేసి మరియు నూతన గృహాలను లబ్ధిదారులతో గృహ ప్రవేశాలను చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం తక్కువ మరియు మధ్య ఆదాయ వర్గాలకు సరసమైన గృహాలను అందించడానికి ప్రారంభించినది ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం. ఈ పథకంలో అర్హత కలిగిన వారికి గృహ రుణంపై సబ్సిడీ ఇవ్వబడుతుంది.