కాండ్రపాడు గ్రామంలో వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి సమేత మహా పంచముఖేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
Nandigama, NTR | Apr 22, 2024 చందర్ల పాడు కాండ్రపాడు గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత మహా పంచముఖేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సోమవారం వుదయం 10 గంటల ప్రాంతంలో ఘనంగా జరిగింది..శ్రీ రాజరాజేశ్వరి సమేత పంచముఖేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో... శ్రీ విజయ గణపతి, మూషిక వాహన, శీతలదేవి (బొడ్రాయి), గ్రామ దేవత ముత్యాలమ్మ, పోతురాజు, తూర్పు రాజగోపుర, శిఖర ప్రతిష్ట, బలిపీఠం ప్రతిష్ట పూజను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు....కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు... అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు