కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కాశిరెడ్డి కాలనీలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్లను ఇస్తామని చెప్పి, ఇంతవరకు ఆ మాట నిలుపుకోలేదన్నారు. ఎంతోమంది అర్హత కలిగిన లబ్ధిదారులు నూతన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి అర్హత గల ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లను ఇకనైనా మంజూరు చేయాలని మున్సిపల్ చైర్మన్ డిమాండ్ చేశారు.