వైస్ ఎంపీపీకు సమాచారం ఇవ్వకుండా లేపాక్షి మండల పరిషత్ సమావేశం నిర్వహించడం పై ప్రశ్నించి వినతి పత్రం అందజేసిన ఎంపీటీసీలు
రెండు రోజుల క్రితం జరిగిన మండల పరిషత్ సమావేశంలో లేపాక్షి కి చెందిన ముగ్గురు ఎంపీటీసీ లు వైస్ ఎంపీపీ అంజినరెడ్డి, జై కిషన్ ,పద్మావతమ్మ , కో ఆప్షన్ భషీర్ కు ఎటువంటి సమాచారం లేకుండా ఎంపీపీ నిధులు 92 లక్షలులో అధికార పార్టీ కి చెందిన ఎంపీటీసీలకు 46 లక్షలు ఇచ్చి లేపాక్షి ఎంపీటీసీ లకు నిధులు ఇవ్వకపోవడంతో లేపాక్షి ఎంపీడీఓ కార్యాలయం ముందు స్థానిక మేజర్ పంచాయతీ ఎంపీటీసీ లు ప్రశ్నించి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఎంపీటీసీ లకు త్వరలోనే తగిన న్యాయం చేస్తామని అంతవరకు నిధులు విడుదల చేయమని, మళ్ళీ మండల సమావేశం జరిపిస్తామని హామీ ఇచ్చారు.