శ్రీశైలం: ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్ సన్నాహకాలపై వ్యవసాయ సిబ్బంది, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లతో సమావేశం
ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్ సన్నాహకాలపై వ్యవసాయ సిబ్బంది, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు అనుకూల పంటల ఎంపికపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులందరికీ విశిష్ట సేవా సంఖ్య నమోదు చేయాలని, దీనివల్ల పీఎం కిసాన్, పంటల బీమా, రుణాలపై వడ్డీ రాయితీ వంటి పథకాల ప్రయోజనాలు పొందవచ్చన్నారు. అలాగే ఖరీఫ్ సీజన్ నుంచి యూరియా, డీఏపీ ఎరువుల విక్రయాలు ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారానే నిర్వహించనున్నట్లు తెలిపారు.