ప్లాస్టిక్ నిర్మూలిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం : జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Mar 28, 2026
ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా మార్చి నెల థీమ్ "ప్లాస్టిక్ రహిత జీవనమే.. స్వచ్ఛ ఆంధ్ర సాధనకు పునాది నినాదంతో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ లో మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాలు చేపట్టి, ప్రతిజ్ఞ ను చేశారు. పోలీస్ కార్యాలయ ఆవరణను శుభ్రం చేయడంతో పాటు చుట్టుపక్కల చెత్తను తొలగించి, పిచ్చి మొక్కలను గుణపం, పారలతో తీసివేశారు.