భామిని మండల కేంద్రంలో కేజీబీవీ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
తేది:05-05-2025 సోమవారం. భామిని మండలం: భామిని మండలం కేంద్రం లో ఆంధ్రప్రదేశ్-సమగ్రశిక్ష(2024-25) 255.50 లక్షలు నిధులతో నూతనంగా ఏర్పాటు చేయబడే కే.జీ.బీ.వీ. జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ సోమవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భవన నిర్మాణంతో కళాశాలకు భావన సమస్య తీరుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో భామిని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు మేడిబోయిన జగదీష్ , రవినాయుడు ,భూపతి ఆనంద్ ,AMC చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.