జడ్చర్ల: నవాబు పేట మండల సింగిల్ విండో దగ్గర యూరియా కోసం బారులు తీరిన రైతులు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబు పేట మండల కేంద్రంలోని సింగిల్ విండో దగ్గర శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి టోకెన్లు ఇవ్వడం, అక్కడే యూరియా పంపిణీ చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోకెన్ల కోసం, యూరియా బస్తాల కోసం రోజుల తరబడి లైన్ లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.