కోడుమూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన హిందూ ధర్మ సమ్మేళనం సభ సందర్భంగా మహా పాదయాత్ర అట్టహాసంగా సాగింది. స్థానిక రామాలయం నుంచి పంచాయతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. రామానుజ జీయర్ స్వామీజీ, ఆదిత్య పరాశ్రీ స్వామీజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దారి పొడవున కోలాటాలు, డప్పు వాయిద్యాలు మేళతాళాల మధ్య హిందువులు కాషాయ జెండాలు మోస్తూ సాగారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలస్ చైర్మన్ ఎద్దుల మహేశ్వర్ రెడ్డి అతిధులను సాదరంగా ఆహ్వానించారు. సభలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసుధర్ ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. స్వామీజీలు సందేశం వినిపించారు.