ఏనుగుల వలన నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు
ఏనుగులు వలన నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పూడితే అప్పలనాయుడు కోరారు. శుక్రవారం ఆయన పార్వతిపురం మన్యం జిల్లా భామినిలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009లో ఒడిస్సా నుండి జిల్లాకు వచ్చిన ఏనుగులు ఇప్పటివరకు 11 మందిని పొట్టన పెట్టుకున్నాయన్నారు. కోట్లాది రూపాయల రైతుల ఆస్తులను, పంటలను నాశనం చేశాయన్నారు. ఏనుగుల సమస్య పరిష్కరించి, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.