వెలుగోడు పట్టణంలోని ఎస్బిఐ బ్యాంకు లో గత ఐదు రోజుల క్రితం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ బ్యాగ్ నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును కొట్టేసిన సంగతి తెలిసిందే ఈ సంఘటన గురించి ఆమె అదే రోజు వెలుగోడు పోలీసులకు ఫిర్యాదు చేయగా,ఛాలెంజింగ్ తీసుకున్న వెలుగోడు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి ముగ్గురు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి వారు దొంగతనం చేసుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత వారి వద్ద ఉన్న రెండున్నర తులాల నాన్ పథకం 2 లక్షల 25 వేల రూపాయల విలువైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులనుఅరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలియజేశారు,