జహీరాబాద్: పట్టణంలో హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పుత్తురాజ్, మణికంఠ కార బట్టి వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవారన్నారు. మణికంఠ వ్యాపారం నిర్వహించే ప్రదేశాల్లో పుత్తురాజ్ వ్యాపారం చేస్తున్నాడని కక్షతో శనివారం మధ్యాహ్నం మణికంఠ పుత్రాజ్ పై దారిలో అడ్డగించి కత్తితో దాడి చేసి అత్యాయత్నం చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బాధితుడి కుమారుడి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.