శ్రీకాకుళం: వైసీపీలో చేరనున్న శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఈ నెల 22న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఈ కార్యక్రమం జరగనుంది. దీని కోసం నేడు సాయంత్రం టౌన్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.