పుట్టపర్తిలో ఎన్ఎంఎంఎస్ పుస్తకాలను జిల్లా విద్యాశాఖాధికారి బి.కిష్టప్పతో కలిసి కలెక్టర్ శ్యాం ప్రసాద్ బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు NMMS పరీక్ష రాసి విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేల చొప్పున 4 ఏళ్లు స్కాలర్షిప్ ఇస్తుందన్నారు. పుస్తకాన్ని జేవీవీ, యూటీఎఫ్ నాయకులు విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడం అభినందనీయమన్నారు.