భీమిలి: మిదిలాపురి ఉడాకాలనీలో కార్లు అద్దాలు పగల కొట్టిని మతి స్థిమితం లేని వ్యక్తి, వర్షంలో చెట్టుకు కట్టేసిన వైనం
మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీ రహదారిలో పెట్రోల్ బంక్ ఎదురుగా అమానావీయమైన ఘటన చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని వ్యక్తి కార్లు అద్దాలను పగలకొట్టాడనే నెపంతో జోరున కురుస్తున్న వానలో రహదారి మధ్యలో చెట్టుకు కట్టి వేసిన ఘటనను చూసి కొందరి మనసులను కలిచి వేసింది. మతి స్థిమితం లేని వ్యక్తి అని తెలిసి కట్టిన వారికి అసలు మతి స్థిమితం లేదు అని కొందరు భావిస్తున్నారు. ఆ వ్యక్తి మాట్లాడే భాష కూడా అర్ధం కావటం లేదని ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని అటువంటి వ్యక్తిని ఎలా కట్టేయాలని పించిందో అర్ధం కావటం లేదని అంటున్నారు.