మడకశిర మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సీరియస్
మడకశిర మండలం తురకవాండ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో మురళీధర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులు సక్రమంగా నిర్వర్తించలేదని గ్రామస్తులు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా ఎంఈఓ భాస్కర్ మంగళవారం పాఠశాలకు వచ్చే గ్రామస్తులు ముందు ఉపాధ్యాయుడిని విచారించారు.అనంతరం షోకాస్ నోటీస్ జారీ చేశారు.తదుపరి ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.