శ్రీశైలం: ఆత్మకూరు మున్సిపాలిటీకి కేటాయించిన డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశిలించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి
ఆత్మకూరు మున్సిపాలిటీకి కేటాయించిన డంపింగ్ యార్డు స్థలాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, డంపింగ్ యార్డు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి సౌకర్యం, చెత్త తరలింపు ప్రక్రియ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు డంపింగ్ యార్డు కీలకమని పేర్కొన్న ఆయన, పనులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.