గుంతకల్లు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి శివారులో అదుపు తప్పిన బైక్, ఇద్దరికీ తీవ్ర గాయాలు, గుత్తికి తరలింపు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ శివారులో మంగళవారం ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున, రామేశ్వరి లు కర్నూలు జిల్లా లక్షుంపల్లి గ్రామంలో బంధువుల జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురంకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.