శ్రీశైలం: సొంత నిధులతో 42 మంది గిరిజన చెంచులకు లైసెన్సులు ఇప్పించిన ఆత్మకూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి
ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి తన సొంత నిధులతో పెద్దచెరువు గూడెంకు చెందిన 42 మంది చెంచు గిరిజనులకు డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొని లైసెన్సులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అధికారులు అందిస్తున్న అవకాశాలు, ప్రోత్సాహాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.సొంత నిధులతో చెంచులకు సహాయం చేసిన ఎంవీఐ సత్యనారాయణ రెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.