వనపర్తి: దావాచిపల్లిలో రైతుల ధర్నా: సాగునీరు కోసం రోడ్డుపై బైఠాయింపు, నిలిచిన ట్రాఫిక్
పాన్గల్ మండలం దావాచిపల్లిలో సాగునీరు అందించాలని రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని నిరసన వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.