కడప నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మనోజ్ రెడ్డి నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అల్‌మాస్‌పేటలో పేరుకుపోయిన చెత్తకుప్పలను గమనించి వెంటనే శుభ్రపర్చాలని సానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు. ఎస్‌వీ డిగ్రీ కాలేజీ వంతెన క్రింద పందులు తిరుగుతున్న పరిస్థితిపై ఇంజనీరింగ్, సానిటేషన్ విభాగాలకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. తరువాత YSR కాలనీ వద్ద సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించిన కమిషనర్, పనులు మందగించడంతో త్వరగా పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిడ్కో భవనాల నిర్మాణ పురోగతిని సమీక్షిస్తూ, నిర్ణయించిన గడువులోపే పనులు పూర్తి చేయాలన్నారు