వికారాబాద్: ఉపాధి హామీ కూలీలను పెంచడంలో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది: డీఆర్డీఓ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలను పెంచడంలో వికారాబాద్ జిల్లా మూడో స్థానంలో ఉందని వికారాబాద్ జిల్లా డీఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో 75% మందికి కూలి పనికి కల్పించేందుకు చర్య తీసుకుంటున్నామని, ఈనెల 6న జిల్లాలో 392 మంది కూలీలు పని చేశారని ఇప్పటివరకు 69% కూలీలకు పని కల్పించామని తెలిపారు.