ఒంగోలు అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేసిన జాయింట్ కలెక్టర్
Ongole Urban, Prakasam | Jul 30, 2026
.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ విద్యాభ్యాసంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్‌లో ని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో 'క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్' మరియు 'క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంపిక చేసిన నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ప్రశంసాపత్రాలను ఆమె చేతుల మీదుగా అందజేశారు.