ఒంగోలు అర్బన్: స్వచ్ఛంద సంస్థల సహకారంతో దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేసిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Aug 1, 2026
ప్రకాశంజిల్లా దర్శి మార్కెట్ యార్డ్ నందు అలిమ్కో సేవా సంస్థ దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజబాబు తో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, పాల్గొని బ్యాటరీ సైకిళ్లు - 143, ట్రే సైకిళ్ళు - 59, వీల్ చైర్లు - 30, వినికిడి యంత్రాలు - 40, చేతి కర్రలు - 37 మొత్తం : 309 పరికరాలను పంపిణీ చేసి దివ్యాంగులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పి.రాజబాబు మాట్లాడుతూ దివ్యాంగులలో ఉన్న శక్తిని వెలికి తీసేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.