మండపేట: మండపేట టీట్కో అపార్ట్మెంట్ల వద్ద తుప్పలు పెరిగిపోయి మారేడుమిల్లి అడవిని తలపిస్తుంది ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
మండపేట టీట్కో అపార్ట్మెంట్ల వద్ద తుప్పలు పెరిగిపోయి మారేడుమిల్లి అడవిని తలపిస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపించారు. తుప్పలు పెరిగిపోయిన పాములు విపరీతంగా సంచరిస్తున్నాయని ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మండపేట గొల్ల పుంత టిట్కో అపార్ట్మెంట్ లను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సాయంత్రం కిటికీ ల నుండి పాములు ఇళ్ళ లోకి వస్తున్నాయని తెలిపారు.