గుంతకల్లు: గుత్తి పట్టణంలోని కస్తూరీ బా గాంధీ, మోడల్ కళాశాలలో సత్తా చాటిన ఇంటర్ విద్యార్థులు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కస్తూరి బా గాంధీ బాలికా విద్యాలయం, మోడల్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించి కళాశాల ప్రిన్సిపాల్ రుద్రాక్షి, కుమారీలు బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూరీ బా గాంధీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 40 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 38 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 35 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో శైలజ 500 మార్కులకు 486 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా నిలించింది.