కురుపాం: ఎల్విన్ పేటలో కలెక్టర్ తనిఖీలు: ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవు!
పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్ పేటలో కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను పరిశీలించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై వ్యాపారులను హెచ్చరించారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని సూచించారు.