ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక తీవ్ర అగచాట్లు
నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి శ్రీశైలం కి వెళ్లే ప్రయాణికులకు సరిపడ బస్సులు లేక ప్రయాణికులు తీవ ఇబ్బందులు గురవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు అనంతపురం, కడప జిల్లాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఆత్మకూరు చేరుకుంటారు. ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్లడానికి బస్సులు ఉంటాయని ఇక్కడికివస్తారు అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున బస్సులు రద్దీకి అనుకూలంగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.