పటాన్చెరు: నూతన మున్సిపాలిటీల ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నూతన మున్సిపాలిటీల ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవ కేంద్రం భవనాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ శ్రీదేవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.