నాగలాపురం యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సూర్య తేజ అరెస్టు: సీఐ మురళి నాయుడు
నాగలాపురం మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజను అరెస్టు చేసినట్లు సిఐ మురళి నాయుడు గురువారం తెలిపారు. ఆయన పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు, గత నెల జరిగిన ఆడిటింగ్ లో సుమారు రెండు కోట్ల 80 లక్షల రూపాయలను గోల్మాల్ చేసినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టామన్నారు.