గుంటూరు: గత రాత్రి నుండి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన గుంటూరు పట్టణం
Guntur, Guntur | Aug 13, 2025 మంగళవారం రాత్రి 10 గంటల నుండి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి గుంటూరు నగరం నీట మునిగింది. నగరంలో మూడు వంతెనలు, కంకర కుంట ఆర్ యు బి తోపాటు చుట్టుగుంట కూరగాయల మార్కెట్ పలు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. దీంతో గుంటూరు నగర వ్యాప్తంగా భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. బుధవారం ఉదయం నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి వర్షపు నీటిని బయటికి పంపించేందుకు సహాయక చర్యలు మొదలుపెట్టారు.