శ్రీశైలం: ఆత్మకూరు పాత బస్టాండ్ లోని బార్బర్ షాప్ లో అగ్ని ప్రమాదం. సుమారు రెండు లక్షల మేర ఆస్తి నష్టం
ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో శనివారం అర్ధరాత్రి మంగలి గాలెన్నకు చెందిన బార్బర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.మంటల్లో షాపు పూర్తిగా దగ్ధమవడంతో షాప్ లోని ఫర్నిచర్ వస్తువులన్నీ ఖాళీ బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఇతర షాపులకు అగ్ని చేరకుండా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల మేర ఆస్తి నష్టం వాటిలిందని మంగలి గాలేన్న తెలియజేశారు. తమను ప్రభుత్వమే అదుకోవాలని విన్నవించాడు