కడపలో వందల కోట్లు విలువ చేసే ఆస్తిలో అక్రమ నిర్మాణం జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడంలేదని వైసీపీ మాజీ టీటీడీ పాలకమండలి సభ్యుడు యానాదయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కడపలోని పాత బస్టాండ్ వద్ద ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ శాఖకి చెందిన ఆస్తిపై టీడీపీ నేతలు కన్నేశారన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాలు ఆపకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.