ఈ ఏడాది లక్ష్యం రెట్టింపు: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
జిల్లాలో వచ్చే ఏడాది వన మహోత్సవానికి 46లక్షల మొక్కలను నాటడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లక్ష్యం రెట్టింపు అయిందన్నారు. సోమవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతుల డిమాండ్, అవసరం, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన మొక్కలను నివేదికలో పొందుపరిచాలన్నారు. ఐటీడీఏ, మండలాల వారీగా మొక్కలు నాటడంకు సంబంధించిన డేటా సిద్ధం చేయాలన్నారు.