గుంతకల్లు: గుత్తి మండలం ఇసురాళ్ళపల్లి గ్రామంలో సైనిక లాంఛనాలతో సీఆర్ పీఎఫ్ జవాన్ వీరాంజనేయులు అంత్యక్రియలు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఇసురాళ్ళపల్లి గ్రామంలో అర్.వీరాంజనేయులు అనే సీఆర్ పీఎఫ్ జవాన్ అంత్యక్రియలు శనివారం సైనిక లాంఛనాలతో నిరవించారు. గ్రామానికి చెందిన జవాన్ వీరాంజనేయులు గుత్తి పట్టణంలో జరిగిన తన మేనల్లుడి వివాహానికి వచ్చి గత శుక్రవారం గాంధీ చౌక్ వద్ద సొమ్మసిల్లి పడి పోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో వీరాంజనేయులు పని చేసే హైదరాబాద్ నుంచి సైనికాధికారులు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గాలిలోకి కాల్చి త్రివర్ణ పతాకం కప్పి పూర్తి చేశారు.