ఆత్మకూరు పట్టణంలో మొదటిసారి పాలిసెట్ 2026 ఎంట్రెన్స్ పరీక్షలు. సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు. తల్లిదండ్రులు
ఆత్మకూరు పట్టణంలో ఈసారి మొదటిసారిగా పాలీసెట్ 2026 ప్రవేశ పరీక్షలు నిర్వహించడం స్థానిక విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటివరకు ఎంట్రెన్స్ పరీక్ష కోసం నంద్యాల, కర్నూలు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, సమయపాలన, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు అదే పరీక్షను స్థానికంగా నిర్వహించడం వల్ల విద్యార్థులు సౌకర్యంగా పరీక్ష రాసే అవకాశం లభించింది.పట్టణంలోనే మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగడింది.