అనంతపురం నగరంలోని మారుతీ నగర్ లో ఆటో డ్రైవర్ పై రాళ్లతో దాడి
Anantapur Urban, Anantapur | Jul 5, 2025
అనంతపురం నగరంలోని మారుతీ నగర్ లో మంజునాథ్ అనే ఆటో డ్రైవర్ పై మారుతి నగర్ ఆటో స్టాండ్ కు చెందిన మసూద్ వలి తోపాటు మరికొంతమంది రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. రక్తపు గాయాలైన అతనిని వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.