గుంతకల్లు: గుత్తి మండలం జక్కలచెరువు శివారు క్రిష్టపాడు వద్ద కల్వర్టును ఢీకొన్న లారీ, డ్రైవర్ చెన్నప్పకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ శివారులో క్రిష్టపాడు వద్ద 67వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం లారీ అదుపు తప్పి కల్వర్టును ఢీ కొన్న ఘటన లో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం క్రిష్టపాడు గ్రామానికి చెందిన చెన్నప్ప గుత్తి నుంచి తాడిపత్రి వైపునకు లోడు వేసుకుని వెళ్తున్నాడు. అయితే క్రిష్టపాడు గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై డ్రైవర్ చెన్నప్ప నిద్ర మత్తులో కునుకు తీసి తూలగా లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీ కొంది. గాయపడిన చెన్నప్ప ను చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు