రహదారులు, భవన నిర్మాణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
రహదారులు, భవన నిర్మాణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఘాట్ రోడ్లలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని ఆర్అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఆర్అండ్ బీ అతిధి గృహానికి సంబంధించి డిజైన్ తయారు చేసి, నివేదికలు అందజేయాలన్నారు. ఆర్అండ్ బీ అతిధి గృహానికి ముందుగా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు.