గ్రామ సంఘాల సహాయకులకు 5జి స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
నేడు వేల్పనూరు గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (వెలుగు) ఆధ్వర్యంలో గ్రామ సంఘాల సహాయకులకు (VOA) 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. గ్రామస్థాయిలో సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు, డిజిటల్ కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి సహకార సంఘాల ఏర్పాటు ద్వారా బలమైన పునాది వేసిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అని ఎమ్మెల్యే అన్నారు.