జగిత్యాల: ఇద్దరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
జగిత్యాల 22వ వార్డులో ఇద్దరు లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రోడ్డ లక్ష్మికి రూ. 2 లక్షలు, కొండ్ర రాజశేఖర్‌కు రూ. 1,44,550 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు.