సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం నందు, ఈవో బీ.నీలకంఠం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవాలు.
కాకినాడ జిల్లా సామర్లకోటలో వేంచేసి ఉన్న పంచరామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం నందు 22వ తేదీ సోమవారం ఉదయం నుండి బాల త్రిపుర సుందరి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కార్నిర్వాహణాధికారి బి.నీలకంఠం ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్ పర్యవేక్షణలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్నిర్వహణాధికారి బి.నీలకంఠ మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుండి రెండవ తేదీ వరకు నిర్వహిస్తామని, అమ్మవారికి కుంకుమ పూజలు ప్రతిరోజు నిర్వహిస్తామని వివిధ అలంకరణలో అమ్మవారికి పూజాలు చేపడతామని తెలిపారు.